‘సమగ్ర’ సమ్మె విరమణ
సివిల్ సప్లయ్ హమాలీలు..
కామారెడ్డి టౌన్: డిమాండ్ల సాధన కోసం సమగ్ర శి క్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ను విరమించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన చర్చలు సఫలం కా వడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయ ణ తెలిపారు. సమ్మె విరమణ పత్రాన్ని డీఈవో ఎస్.రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ పేస్కేల్ అమలు చేయడానికి ప్రభుత్వం మూడు నెలల గడువు తీసుకుందని, మిగతా ఆర్థికేతర అంశాలన్నీ పరిష్కరిస్తామని, సమ్మె కాలపు వేతనాన్ని చెల్లిస్తామని ఉప ముఖ్య మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో తా త్కాలికంగా సమ్మె విరమిస్తున్నామన్నారు. సమ్మెకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, వివిధ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, ప్రతినిధులు రాములు, సంతోష్‌రెడ్డి, శైలజ, వనజ, శ్రీవాణి, కాళిదాస్, కల్యాణ్, సంధ్యారాణి, సాయిలు, గంగప్రసాద్, శంకర్, దినేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: సమస్యల పరిష్కారం కోసం సివిల్ సప్లయ్ హమాలీలు వారం రోజులుగా చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బాల్‌రాజు తెలిపారు. సివిల్ సప్లయ్ హమాలీలకు ఎగుమతి, దిగుమతి కూలీ రేటు పెంపు జీవోను త్వరలో విడుదల చేసి అమలు చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment