రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలి
కామారెడ్డి రూరల్ : నూతన పాలకవర్గ సభ్యులు మార్కెట్ కమిటీకి ఆదాయం వచ్చేలా చూస్తూనే రైతుల శ్రేయస్సు కోసం కష్టపడాలని ఎకై ్సజ్, టూరిజం శాఖల మంత్రి జూపల్లి కృష్‌ణ్రాావు సూచించారు. మంగళవారం కామారెడ్డి గాంధీగంజ్‌లోని మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం నిర్వహించారు. పాలకవర్గంతో మంత్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవులు అలంకారప్రాయం కావద్దన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హనుమకొండ జిల్లాలోని ముల్కనూర్ సొసైటీని పాలకవర్గం సందర్శించాలని, అక్కడి విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేసేందుకు కృషి చేయాలని సూచించారు.
ప్రభుత్వాన్ని విమర్శించే హక్కులేదు..
ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత గత ప్రభుత్వానిదేనన్నారు. ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని పేర్కొన్నారు. కామారెడ్డి పెద్ద చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడం కోసం రూ. 50 లక్షలు మంజూరు చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, వైస్ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పండ్ల రాజు, పున్న రాజేశ్వర్, ఎడ్ల రాజిరెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, తిర్మల్‌గౌడ్, అశోక్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌కు చెంపపెట్టు
ఏసీబీ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం ఆయనకు చెంపపెట్టు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నా రు. ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇ స్తామని పేర్కొన్నారు. కామారెడ్డి మార్కెట్ క మిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ సురేశ్ షెట్కార్ హామీ ఇచ్చారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు
ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
Comments
Please login to add a commentAdd a comment