25లోగా సీఎంఆర్ పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: గతేడాది రబీ సీజన్‌కు సంబంధించిన కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఈనెల 25వ తేదీలోగా అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం జిల్లాలోని రైస్ మిల్లర్లతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది రబీలో సేకరించిన ధాన్యాన్ని లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేసి సరఫరా చేయలేదన్నారు. నిర్ణీత గడువులోగా సీఎంఆర్ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అన్ని రైస్‌మిల్లులను తనిఖీ చేసి బియ్యం నిల్వలను పరిశీలించాలని ఆదేశించారు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌పై అధికారులను వాకబు చేశారు. త్వరగా సీఎంఆర్ పూర్తి చేసి, జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు మిల్లర్లు సహకరించాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్‌వో మల్లికార్జున్ బాబు, అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
గడువు దాటితే చర్యలు తప్పవు
రైస్ మిల్లర్లతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment