‘కేసులకు దూరంగా ఉండాలి’ | - | Sakshi
Sakshi News home page

‘కేసులకు దూరంగా ఉండాలి’

Published Wed, Jan 8 2025 1:24 AM | Last Updated on Wed, Jan 8 2025 1:25 AM

‘కేసు

‘కేసులకు దూరంగా ఉండాలి’

కామారెడ్డి క్రైం : అసిస్టెంట్‌ ఎస్పీ చైతన్యరెడ్డి మంగళవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం సస్పెక్ట్‌ షీట్‌ కలిగిన వ్యక్తులకు స్టేషన్‌ ఆవర ణలో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వివాదాలు, కేసులకు దూరంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీ త్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. కార్యక్రమంలో పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

‘యోగా, ధ్యానంతో

జీవన విధానంలో మార్పు’

కామారెడ్డి అర్బన్‌: యోగా, ధ్యానం ద్వారా మనిషి జీవన విధానంలో మంచి మార్పు వ స్తుందని స్వామి బ్రహ్మానంద సరస్వతి అ న్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని పాతరాజంపేట ఆర్ష గురుకులంలో వారం రోజుల యోగా సాధన శిబిరం కార్యక్రమంలో స్వా మి బ్రహ్మానంద సరస్వతి పాల్గొన్నారు. ఈ నెల 12 వరకు నిర్వహించే ఈ శిబిరంలో యోగ దర్శనం, సంస్కృత పరిచయం, ఆహా ర, ఆరోగ్య నియమాలు, ధర్మార్థ కామ మో క్షాలు, ఉదయం, సాయంకాల యజ్ఞం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

బాన్సువాడ రూరల్‌: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్‌ సూచించారు. మంగళవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ప్రారంభించిన అనంతరం బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ద్విచక్రవాహనాలు నడిపే వారు కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను తప్పకుండా పాటించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గంగాధర్‌, ఇంటర్‌ నోడల్‌ ఆఫీసర్‌ షేక్‌ సలాం తదితరులు పాల్గొన్నారు.

‘నర్సరీల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి’

లింగంపేట: నర్సరీల నిర్వహణలో జాగ్రత్త లు పాటించాలని జిల్లా పరిషత్‌ సీఈవో చందర్‌నాయక్‌ సూచించారు. మంగళవారం ఆ యన నల్లమడుగు శివారులోని నర్సరీని పరిశీలించారు. నర్సరీలను కార్యదర్శులు ఎప్ప టికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. డంపింగ్‌యార్డు, వర్మి కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రాలను పరిశీలించారు. అన్ని గ్రామ పంచాయితీలు డంపింగ్‌ యార్డుల్లో వర్మి కంపోస్టు ఎరువులు తయారు చేసి, ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో నరేశ్‌, ఏపీఎం శ్రీనివాస్‌ తదితరులున్నారు.

‘విద్యుత్‌ సమస్య

తలెత్తకుండా చర్యలు’

కామారెడ్డి టౌన్‌: జిల్లాకేంద్రంలో విద్యుత్‌ స మస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నా మని ట్రాన్స్‌కో డివిజన్‌ ఇంజినీర్‌ కల్యాణ్‌ చ క్రవర్తి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గడి వా టర్‌ ట్యాంక్‌ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ సమస్య ఉండడంతో మంగళవారం అధికారులతో కలిసి సందర్శించారు. ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్‌ ఏ ర్పాటు చేయాలని స్థానికులు కోరగా త్వర లో ఏర్పాటు చేస్తామని డీఈ హామీ ఇచ్చా రు. ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు జరిపించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కన్నయ్య, వేణు, ఏడీ కిరణ్‌ చైతన్య, ఏఈ రంజిత్‌కుమార్‌, లైన్‌మన్‌ స్వామి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
‘కేసులకు దూరంగా  ఉండాలి’ 
1
1/4

‘కేసులకు దూరంగా ఉండాలి’

‘కేసులకు దూరంగా  ఉండాలి’ 
2
2/4

‘కేసులకు దూరంగా ఉండాలి’

‘కేసులకు దూరంగా  ఉండాలి’ 
3
3/4

‘కేసులకు దూరంగా ఉండాలి’

‘కేసులకు దూరంగా  ఉండాలి’ 
4
4/4

‘కేసులకు దూరంగా ఉండాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement