ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

Published Wed, Jan 8 2025 1:24 AM | Last Updated on Wed, Jan 8 2025 1:25 AM

ఇచ్చి

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

బాన్సువాడ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం బాన్సువాడకు వచ్చిన ఆయన.. రోడ్డు భద్రత మాసోత్సవ ర్యాలీని ప్రారంభించారు. పట్టణంలో రూ. 40 లక్షలతో నిర్మించిన ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. మున్సిపల్‌ కార్యాలయం వద్ద రూ. 52 కోట్లతో చేపట్టిన అమృత్‌ 2.0 పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బల్దియా వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. భవిష్యత్‌లో తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రూ. 52 కోట్లతో అమృత్‌ 2.0 పథకం మంజూరు చేయించారన్నారు. ఇల్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను మంజూరు చేసి రూ. 5 లక్షలు ఇస్తామని పేర్కొన్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజురు చేశామన్నారు. రైతు భరోసా కింద ఏడాదికి ఎకరానికి రూ. 12 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, దీనిపై మాజీ మంత్రి కేటీఆర్‌ తన సొంత పత్రికలో అబద్ధాలతో రాద్ధాంతం చేయిస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కలలో కూడా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాదన్నారు. రోజూ గంట సమయాన్ని ఆరోగ్యం కోసం కేటాయిస్తే నిండునూరేళ్లు జీవిస్తామని, ప్రజలు దీన్ని గమనించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. కామారెడ్డితో పాటు బాన్సువాడను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ పేర్కొన్నారు.

తాగునీటి సమస్య లేకుండా..

భవిష్యత్‌లో మంచినీటి సమస్య ఉండకుండా శాశ్వత పరిష్కారం కోసం అమృత్‌ 2.0 పథకం మంజూరు చేయించామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రెండేళ్లలో పనులు పూర్తవుతాయని, రాబోయే 50 ఏళ్లు మంచి నీటి కొరత ఉండదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం1
1/1

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement