సహకార చట్టం–1995పై అవగాహన
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామ సంఘాల సభ్యులకు సహకార చట్టం మాక్స్ యాక్ట్–1995పై మంగళవారం డీఆర్‌డీవో సురేందర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లింగంపేట ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల సమాఖ్య సభ్యుల బైలా శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంఘాల ఆవశ్యకత, బైలా చట్టం అమలు, మహిళా శక్తి కార్యక్రమాల అమలు, బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాల గురించి వివరించారు. అలాగే జెడ్పీ సీఈవో చందర్‌నాయక్ మాట్లాడారు. రుణాలు తీసుకున్న సభ్యులు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధించినట్లవుతుందన్నారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షులు సులోచన, ఏపీఎం శ్రీనివాస్, సీసీలు గంగరాజు, శ్రావణ్‌కుమార్, మన్సూర్‌ఖాన్, మేహర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment