డిచ్‌పల్లి: స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం డిచ్‌పల్లిలో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలలో కొద్దిగా నిరాశ ఉందన్నారు. పదేళ్లు ఎన్నో కష్టానష్టాలకు ఓర్చి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఆదుకునే సమయం ఇదేనన్నారు. మాకు పదవులు వచ్చాయన్నా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నా అదంతా కార్యకర్తల కృషి వల్లేనన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా పదవులు రాలేదని నిరాశకు గురికావద్దని, స్థానిక సమరం మీదేనని, ఓపికగా ఉండాలని సూచించారు. విభేదాలను వీడి, అందరినీ కలుపుకు ని వెళ్లాలని నాయకులకు సూచించారు. ఫార్ములా – ఈ కార్ రేస్‌లో అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ అన్నారు. పదేళ్ల తర్వాత బీసీలపై ప్రేమ నటిస్తున్న కవితను చూస్తే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
నఫ్రత్ చోడో.. నిజామాబాద్ జోడో..
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నఫ్రత్ చోడో.. నిజామాబాద్ జోడో.. అని ఐకమత్యంగా ఉండి స్థా నిక ఎన్నికల్లో వందశాతం విజయం సాధించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించాలని పిలుపునిచ్చారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతి రెడ్డి, సంజయ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పదవులు రాలేదని నిరాశ చెందొద్దు
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment