ఖలీల్‌వాడి: జిల్లాలో ఇటీవల నిర్వహించిన డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ పలువురికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధించినట్లు ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి మంగళవారం తెలిపారు. డిచ్‌పల్లి మండలం మెట్రాజ్‌పల్లికి చెందిన ఇసపల్లి అబ్బయ్యకు ఒక రోజు జైలు శిక్ష, అలాగే శివతండాకు చెందిన కేతవాత్ సంతోష్, ముల్లంగికి చెందిన షేక్ జియోవుద్దీన్, మద్దెపల్లికి చెందిన ఇస్లావత్ శివరాంలకు రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు తెలిపారు. అలాగే పోతంగల్‌కు చెందిన తోకల సంజీవ్, బోధన్‌కు చెందిన బంటు శ్రీనివాస్‌కు రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. వీరిని సారంగాపూర్ జైలుకు తరలించినట్లు వివరించారు.
కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన టేకు రమేష్ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడపగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. నిందితుడిని మంగళవారం ఆర్మూర్ కోర్టులో హాజరుపరుచగా రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.
ఖలీల్‌వాడి: డ్రంకన్‌డ్రైవ్‌లో పట్టుబడిన 21 మందికి నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ మంగళవారం తెలిపారు. వారిలో 19 మందికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్‌కు రూ.28,500 జరిమానా విధించగా, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
సిరికొండ మండలంలో..
సిరికొండ: మండలంలోని చిన్న వాల్గొట్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి నిర్వహించిన డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో నలుగురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామ్ తెలిపారు. వాహనాలను తనిఖీ చేస్తున్నప్పుడు పరీక్షలు నిర్వహించగా నలుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు తెలిసిందన్నారు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment