సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి
బాన్సువాడ : నిజాంసాగర్ ప్రాజెక్టునుంచి విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వాడుకో వాలని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు సూచించారు. సోమ వారం బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడు తూ అధికారులు సమన్వయంతో పనిచేసి సాగునీరు వృథా కాకుండా చూడాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకుంటే మిగిలిన నిజాంసాగర్ నీటితో వచ్చే ఖరీఫ్‌లో నారుమడులు వేసుకోవచ్చన్నారు. సమావేశంలో బా న్సువాడ, బోధన్ సబ్ కలెక్టర్లు కిరణ్మయి, వికాస్ మహతో, నిజాంసాగర్ సీఈ శ్రీనివా స్, ఎస్‌ఈ రాజశేఖర్, ఈఈ బలరాం, డీఈలు జగదీష్, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, ఏఈలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
నేడు జిల్లాకు
మంత్రి జూపల్లి రాక
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉద యం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10 గంటలకు బాన్సువాడకు చేరుకుని, ఎక్సైజ్ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. రూ. 52 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కామారెడ్డికి చేరుకుని కామారెడ్డి మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయా కార్యక్రమాలలో ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment