7న బాన్సువాడకు మంత్రి జూపల్లి రాక
బాన్సువాడ : జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఎకై ్సజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 7న బాన్సువాడకు రానున్నారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బాన్సువాడలో నిర్మించిన ఎకై ్సజ్ కార్యాలయాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి జూపల్లి నూతన ఎకై ్సజ్ భవనాన్ని ప్రారంభిస్తారన్నారు. రూ.52 కోట్లతో చేపట్టే అమృత్ 2.0 పథకం పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. మంత్రి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఆర్టీసీ డీఎం సరితాదేవి, ఎకై ్సజ్ సీఐ యాదగిరిరెడ్డి తదితరులున్నారు.
నర్సింగ్ కళాశాల భవన
నిర్మాణం పరిశీలన
నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి గ్రామ శివారులో నిర్మిస్తున్న బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవనం పనులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో మాట్లాడి , వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకుడు పెర్క శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment