ఇరుకుగా సర్వీసు రోడ్డు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జాతీయ రహదారి 44 బైపాస్ రోడ్డుపై నర్సన్నపల్లి చౌరస్తా వద్ద వంతెన నిర్మించిన అధికారులు సర్వీసు రోడ్డును మాత్రం ఇరుకుగా మార్చారు. దీంతో హైదరాబాద్ వైపు నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైవే నుంచి కామారెడ్డి పట్టణానికి వచ్చే మార్గం సింగిల్ రోడ్డుతో సరిపెట్టారు. నిత్యం వేలాది వాహనాలు కామారెడ్డి పట్టణానికి వస్తుంటాయి. ఇరుకు రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు, లారీలు పట్టణానికి వచ్చేందుకు సర్వీసు రోడ్డుపైకి రావడంతో వెనక వచ్చే వాహనదారులు ఓవర్‌టేక్ చేసే పరిస్థితి లేకుండాపోయింది. రూ.కోట్లు ఖర్చు చేసి వంతెనలు నిర్మించి సర్వీసు రోడ్డును ఎందుకు డబుల్ రోడ్డు చేయలేదో అధికారులకే తెలియాలి. సర్వీసు రోడ్డుమీద ఏదైనా ప్రమాదం జరిగినా, వాహనం చెడిపోయినా రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. డబుల్ రోడ్డుగా మార్చేందుకు హైవే అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నర్సన్నపల్లి వద్ద ఇరుకుగా ఉన్న సర్వీస్ రోడ్డు
నర్సన్నపల్లి వంతెన వద్ద సింగిల్ రోడ్డు
జిల్లా కేంద్రానికి వచ్చే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
రద్దీ ఎక్కువ ఉంటుందని
తెలిసినా నిర్లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment