నిరుపయోగంగా రైతు బజార్
● రోడ్లపైనే కూరగాయల విక్రయాలు
● పట్టించుకోని బల్దియా అధికారులు
కామారెడ్డి టౌన్ : రైతులు కూరగాయాలు విక్రయించేందుకు జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్‌లో నాలుగేళ్ల క్రితం రైతు బజార్ నిర్మించారు. ఇందులో 50కి పైగా దుకాణాలున్నాయి. రూ. 50 లక్షలతో నిర్మించిన రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. దీంతో రోడ్లపైనే కూరగాయల విక్రయాలు సాగుతున్నాయి. రైతుబజార్ ఉన్నా రైతులు రద్దీగా ఉండే రోడ్లపైనే కూరగాయలను అమ్ముకుంటున్నారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చాలు చుట్టు పక్కన గ్రామాల నుంచి రైతులు, చిరు వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చి పట్టణంలోని సుభాష్‌రోడ్, మాయాబజార్, భారత్‌రోడ్‌లలో రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తుంటారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు స్పందించి గాంధీ గంజ్‌లోని రైతుబజార్‌ను వినియోగంలోకి తేవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment