రిమాండ్‌లో నలుగురు టీచర్లు
నిజాంసాగర్: జుక్కల్ నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ విద్యాలయంలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన నలుగురు ఉపాధ్యాయులపై వారం క్రితం పోక్సో కేసు నమోదయ్యింది. వారిని మూడు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంత్రి జూపల్లి
సభా స్థలి పరిశీలన
బాన్సువాడ : బాన్సువాడలో మంగళవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనే సభా స్థలాన్ని ఆదివారం మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. బాన్సువాడలో నూతనంగా నిర్మించిన ఎకై ్సజ్ శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం, అమృత్ 2.0 పథకానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నిర్వహించే సభకు మంత్రి హాజరు కానున్నారు. సభ స్థలాన్ని పరిశీలించిన వారిలో కాంగ్రెస్ నాయకులు నార్ల సురేష్ తదితరులు ఉన్నారు.
నాయక్‌పోడ్‌ల సమస్యలు
పరిష్కరించాలి
నిజాంసాగర్(జుక్కల్): ఆదివాసి నాయక్‌పోడ్‌లు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం రాత్రి హైదరాబాద్‌లో ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ శరత్‌ను ఆదివాసి నాయక్‌పోడ్ సంఘం జిల్లా నాయకులు కలిశారు. నాయక్‌పోడ్ కులస్తులను కులధ్రువీకరణ పత్రాల మంజూరు విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, ఎంఫ్లాయ్‌మెంట్‌తోపాటు పైచదువుల కోసం అవసరమైన సర్టిఫికెట్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ద్వారా కోరారు. పోడు భూముల కేటాయింపులో జరుగుతున్న అన్యాయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సంఘం గౌరవ ఽఅధ్యక్షుడు బండారి భోజన్న, గాండ్ల రాంచందర్, హైకోర్టు అడ్వొకేట్ పి.కిషన్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment