శారీరక శ్రమ తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అనేక రకాలైన మానసిక ఒత్తిళ్లు రక్తపోటు, మధుమేహం పెరగడానికి కారణమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో నవ యువకులు సైతం గుండెపోటుతో మరణిస్తుండడానికి ఇవే కారణాలుగా స్పష్టమవుతోంది. ప్రధానంగా 30 ఏళ్లు పైబడిన వారిలో చాలా మంది ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మద్యపానం, రకరకాల జంక్ ఫుడ్స్ తీసుకోవడం వంటి కారణాలు కూడా బీపీ, షుగర్లకు కారణమవుతున్నాయి.
● ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యపానం, దూమపానం బీపీ పెరగడానికి కారణాలు. మూత పిండాల పనితీరు దెబ్బతిన్నా బీపీ వస్తుంది. దీంతో పాటు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు పెరిగి రక్తనాళాలు మందంగా మారి బీపీ వస్తుంది.
● టైప్– 1 మధుమేహం చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది. ఈ రకం షుగర్ సోకిన వారిలో ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి అవుతంది. బాధితులు ఇన్సులిన్ తీసుకోవాలి.
● టైప్– 2 మధుమేహం సాధారణంగా మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లతో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment