ఘనంగా లూయీస్ బ్రెయిలీ జయంతి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: అంధుల కోసం ప్రత్యేక లిపిని రూపొందించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి లూయీస్ బ్రెయిలీ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. లూయీస్ బ్రెయిలీ జయంతిని శనివారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతను అందిస్తుందన్నారు. అంధులు తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి బ్రెయిలీ లిపిలో ప్రత్యేక బ్యాలెట్ పేపర్‌ను ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. దివ్యాంగులకు జిల్లాలో ప్రత్యేకంగా గ్రంథాలయం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో బ్రెయిలీ లిపిలో ప్రచురించిన క్యాలెండర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సీడీపీవో రోచిష్మ , దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment