పోచారం నీటి విడుదల ప్రారంభం
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు పరిధిలో యాసంగి పంటల సాగు కోసం శనివారం ఇరిగేషన్ ఎస్‌ఈ విద్యావతి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గేట్ల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ప్రాజెక్టు నీటిని ఈ యాసంగి సీజన్‌లో ‘ఏ’ జోన్‌కు కేటాయించామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.595 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఆయకట్టు భూములకు ఐదు విడతలలో 1.520 టీఎంసీల నీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రతి విడతలో 15 రోజుల పాటు నీటిని విడుదల చేస్తామని, పది రోజుల విరామం ఇస్తామని తెలిపారు. మొదటి విడతలో ఈనెల 18వ తేదీ వరకు నీటిని విడుదల చేస్తామన్నారు. పది రోజులు విరామం అనంతరం తిరిగి ఈనెల 29న రెండో విడత నీటి విడుదలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నీటిని ఆయకట్టు రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్ రజితరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ మల్లేశ్, డీఈఈ వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి రత్నం, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో ప్రభాకరచారి, ఏఈ అక్షయ్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, నాయకులు రాంచందర్‌రెడ్డి, శ్రీరాంగౌడ్, లక్ష్మణ్, వెంకట్రాంరెడ్డి, నర్సింహారెడ్డి, వాసురెడ్డి, నాగేష్, పర్వతరావు, గోపాల్, ఫారూక్, గులాం తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్న
ఇరిగేషన్ ఎస్‌ఈ విద్యావతి,
ఆర్డీవో ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment