‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

Published Sat, Feb 8 2025 8:21 AM | Last Updated on Sat, Feb 8 2025 8:21 AM

‘చట్ట

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

కామారెడ్డి టౌన్‌: హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్‌ జైల్‌ను సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఖైదీల హక్కులు, చట్టాల గురించి వివరించారు. ఫిర్యాధుల బాక్స్‌, వంట గదులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాది మోహన్‌రావు, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శ్రీనివాస్‌రావు, సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ సంజీవరెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది శ్రావణ్‌, సాయిప్రణీత్‌, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

‘ఎరువుల కొరత లేదు’

భిక్కనూరు: జిల్లాలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం ఆయన అంతంపల్లి, పెద్దమల్లారెడ్డి, జంగంపల్లి గ్రామాల్లోని సింగిల్‌ విండోలను సందర్శించి, ఎరువుల నిల్వల తెలుసుకున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలని సొసైటీల సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, సింగిల్‌ విండోల సీఈవోలు శ్రీనివాస్‌, మోహన్‌గౌడ్‌ తదితరులున్నారు.

‘రోడ్డు ప్రమాదాల

నివారణకు ప్రత్యేక చర్యలు’

భిక్కనూరు: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె భిక్కనూరు మండలంలోని జాతీయ రహదారిపై గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలు జరగడానికి కారణాలు తెలుసుకుని, తిరిగి ప్రమాదాలు జరగుకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతంలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. ఆమె వెంట సీఐ సంపత్‌కుమార్‌, ఎస్సై ఆంజనేయులు ఉన్నారు.

దేవునిపల్లి పీఎస్‌ పరిధిలో..

కామారెడ్డి క్రైం: దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లింగాపూర్‌, చిన్నమల్లారెడ్డి, పొందుర్తి, క్యాసంపల్లి ప్రాంతాల్లోని హాట్‌స్పాట్‌లను ఏఎస్పీ చైతన్యరెడ్డి పరిశీలించారు. ఆమె వెంట కామారెడ్డి రూరల్‌ సీఐ రామన్‌, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది ఉన్నారు.

బస్టాండ్‌ పరిశీలన

లింగంపేట: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను శుక్రవారం ఆర్‌ఎం జ్యోత్స్న సందర్శించారు. బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంక్‌ను పరిశీలించారు. కామారెడ్డి డిపో మేనేజర్‌ ఇందిరతో మాట్లాడి బంక్‌ మూసి ఉండడానికి గల కారణాలను తెలుసుకున్నారు. బస్టాండ్‌కు ఇరువైపులా ఉన్న ప్రవేశ ద్వారాల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆమె వెంట డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, బస్టాండ్‌ కంట్రోలర్‌ రఫీక్‌ తదితరులున్నారు.

రేషన్‌ కార్డుల దరఖాస్తులకు వెబ్‌సైట్‌ పునరుద్ధరణ

కామారెడ్డి క్రైం: రేషన్‌ కార్డులకోసం దరఖా స్తు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ సేవలను పునరిద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ప్రజాపాలన కేంద్రాలలో దరఖాస్తు చేసుకోని వారు మీసేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
1
1/3

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
2
2/3

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
3
3/3

‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement