![అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07kmr156-250057_mr-1738982071-0.jpg.webp?itok=cu6fsnAk)
అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలి
కామారెడ్డి టౌన్: పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సత్తాచాటాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నీలం చిన్నరాజులు ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షురాలు అరుణతార నుంచి నీలం చిన్నరాజులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించేలా ఇప్పటి నుండే కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిని సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు మురళీధర్‌గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, కిషన్‌రావు, నేరెళ్ల ఆంజనేయులు, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment