సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నోడల్ అధికారులను నియమించారు. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఈనెల 11 న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాలు ప్రకటించనున్నారు. 11 నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. 13 న రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి 14 న అభ్యంతరాలపై నిర్ణయం తీసుకుంటారు. 15 న ఫైనల్ డ్రాఫ్ట్ ప్రకటిస్తారు.
ఎన్నికల అధికారులకు శిక్షణ
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఈనెల 12 లోపు శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు 15 లోపు శిక్షణ పూర్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఎన్నికల అధికారుల నుంచి వస్తున్న ఆదేశాలను చూస్తుంటే ఎన్నికల షెడ్యూల్ ఈ నెలలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
ఇప్పటికే నోడల్ అధికారుల నియామకం
11 న పోలింగ్ కేంద్రాల
ముసాయిదా ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment