కామారెడ్డి అర్బన్: కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని కినలూర్‌లో గల ఉష స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ (యూఎస్‌ఏ)లో ప్రవేశం కోసం బాలికలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగలవారు వచ్చేనెల 1వ తేదీన ఉదయం 8 గంటలకు కినలూర్‌లోని యూఎస్‌ఏ మైదానంలో నిర్వహించే పోటీలకు హాజరు కావాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ సూచించారు. 2012, 2013, 2014 సంవత్సరాల్లో జన్మించిన బాలికలు అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 95390 07640 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment