![సుభాష్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు!](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/subhashreddy_mr-1738982070-0.jpg.webp?itok=H2BPsjX4)
సుభాష్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత వడ్డేపల్లి సుభాష్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి.చిన్నారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న విషయంలో షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందలేదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడినందునే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కొనసాగిన వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్టు కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే మదన్‌మోహన్‌రావుకు టికెట్టు దక్కడంతో సుభాష్‌రెడ్డి పార్టీకి రిజైన్ చేసి బీజేపీలో చేరారు. బీజేపీ టికెట్టుపై పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రా వడంతో సుభాష్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తనకంటూ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మధన్‌మోహన్‌రావు, సుభాష్‌రెడ్డి వర్గాల మధ్య పొసగడం లేదు. ఇరు వర్గాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుభాష్‌రెడ్డి వ్యవహారంపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో పీసీసీ క్రమశిక్షణ సంఘం సుభాష్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సుభాష్‌రెడ్డి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని క్రమశిక్షణ సంఘం.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సస్పెన్షన్ వేటు వేయడం పార్టీలో చర్చనీయాంశమైంది.
‘స్థానిక’ పోరు ముందు
కాంగ్రెస్‌లో కీలక పరిణామం
చర్చనీయాంశంగా
మారిన పార్టీ నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment