రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీలు | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయంలో అంతర్గత బదిలీలు

Published Mon, Aug 26 2024 11:56 PM | Last Updated on Mon, Aug 26 2024 11:56 PM

-

వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయంలో ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతోపాటు శ్రీస్వామి వారికి సమర్పించే నైవేద్యంలో అలసత్వం ప్రదర్శించిన అంశాన్ని ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. 20 మంది సిబ్బందిని అంతర్గత బదిలీ చేశారు. గోదాం పర్యవేక్షకుడు వరి నర్సయ్యను గోశాల, టెంపుల్‌ అండ్‌ పార్కింగ్‌ సానిటేషన్‌, హౌస్‌ కీపింగ్‌కు, పర్యవేక్షకుడు వెల్ది సంతోష్‌కు అకౌంట్స్‌తోపాటు అదనంగా గోదాం బాధ్యతలు అప్పగించారు. మరో పర్యవేక్షకుడు జి.అశోక్‌ను ప్రస్తుతం ఉన్న బాధ్యతలతోపాటు నిత్యాన్నదానం, పార్కింగ్‌ సానిటేషన్‌, అన్ని వసతి గదుల్లో హౌస్‌ కీపింగ్‌ బాధ్యతలు చూడాలన్నారు. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా 9 మంది సీనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేశారు. ఈఆర్‌వీ భీమేశ్వర్‌కు అకౌంట్స్‌, భారత్‌ గ్యాస్‌, వి.శ్రీకాంత్‌కు భీమేశ్వర సదన్‌, పార్వతీపురం వసతి గదుల ఇన్‌స్పెక్టర్‌గా, ఎస్‌.సురేశ్‌కు పూజల స్టోర్స్‌తోపాటు ప్రధానాలయం ఇన్‌స్పెక్టర్‌గా, వి.శ్యాంకు సబ్‌ టెంపుల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా, ఎడ్ల శివసాయికి ప్రోటోకాల్‌ ఆఫీస్‌, సబ్‌ టెంపుల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా, టి.రాజేశ్వర్‌రావుకు మెయిన్‌ టెంపుల్‌ స్పేర్‌తోపాటు సబ్‌ టెంపుల్స్‌ ఇన్‌స్పెక్టర్‌–3గా అదనపు బాధ్యతలు, ఎం.నర్సింహకు కల్యాణకట్ట, బి.శంకర్‌కు మెయిన్‌ బుకింగ్‌ కౌంటర్‌, బి.లక్ష్మీనర్సయ్యకు ఎ–1 సెక్షన్‌తోపాటు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ విధులు, ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు రవికి గోశాలతోపాటు భారత్‌ గ్యాస్‌, కె.సింహాచార్యులుకు ప్రోటోకాల్‌ సెంటర్‌, ఐదుగురు రికార్డు అసిస్టెంట్లు ఎన్‌.సుశీల్‌కు మెయిన్‌ బుకింగ్‌, పి.మల్లేశంకు విచారణ కార్యాలయం క్లర్క్‌, టి.అజయ్‌కుమార్‌కు విచారణ కార్యాలయం క్లర్క్‌, డి.మమతకు కల్యాణకట్ట–2, ఆర్‌.చంద్రమౌలికి కల్యాణకట్ట–1 బాధ్యతలు అప్పగించారు. బి.రమాదేవి పరిచారకను మెయిన్‌ టెంపుల్‌ స్పేర్‌కు బదిలీ చేశారు.

ఆలయంలో ఆకస్మిక తనిఖీలు

రాజన్న ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరగడంతో ఈవో వినోద్‌రెడ్డి స్వయంగా అన్ని కౌంటర్లు, చెక్‌పోస్టులు, క్యూలైన్లను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బ ందికి ఎప్పటికప్పుడు విధులు కేటాయించారు.

ఏసీబీ దాడుల నేపథ్యంలో

ఈవో సీరియస్‌

20 మందికి స్థానచలనం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement