కిడ్నాపర్లు చిత్రహింసలు పెట్టిండ్రు
వేములవాడఅర్బన్: కొడుకు చేసిన అప్పు కారణంగా తల్లిని కిడ్నాప్ చేసిన ఉదంతం కలకలం సృష్టించిన విషయం విధితమే. పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించడంతో బాధితురాలు క్షేమంగా ఇల్లు చేరింది. శుక్రవారం ‘సాక్షి’ పలకరించగా చిత్రహింసలు పెట్టిండ్రు అంటూ.. తన ఆవేదన వెలిబుచ్చింది. వివరాలు ఆమె మాటల్లోనే.. వేములవాడకు చెందిన భీమాబాయి కొడుకు శ్రీనివాస్ చేసిన అప్పు తీర్చకపోవడంతో మహారాష్ట్రకు చెందిన నాగోరావు, అతని భార్య పంచపులబాయి బుధవారం రాత్రి కారులో వేములవాడకు వచ్చి, భీమాబాయిని కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు కారులో మహారాష్ట్ర వెళ్లే వరకు ఆమెను కొట్టారు. దారి వెంట చెరువులు, కుంటలు వచ్చినప్పుడు వాటిలో పడేస్తామని బెదిరించారు. రాత్రి ఆకలి అవుతుందన్నా అన్నం కాదు కదా కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. మార్గమధ్యలో చీకటి పడితే ఓచోట గది తీసుకొని, అందులో బంధించారు. గురువారం తెల్లారేసరికి భీమాబాయి కళ్లు తిరిగిపడిపోయింది. అప్పుడు టిఫిన్ పెట్టారు. వేములవాడ పోలీసులు ఉదయం 8 గంటల వరకు మహారాష్ట్రలోని నర్సి పోలీస్‌స్టేషన్‌కు రావడంతో తనను అక్కడికి తీసుకెళ్లారని తెలిపింది. పోలీసులు నర్సి నుంచి నేరుగా వేములవాడ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారని, తర్వాత ఇంట్లో అప్పజెప్పారని కంటతడి పెట్టింది.
తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వలేదు
భీమాబాయి ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment