అన్నపూర్ణ సేవా సమితి
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణానికి చెందిన 11 మంది అన్నపూర్ణ సేవా సమితిగా ఏర్పడ్డారు. రెండేళ్లుగా శ్రీవిశ్వేశ్వరస్వామి(బొమ్మలగుడి) దేవాలయంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. దాతలు పుట్టిన రోజు, పెళ్లిరోజు, గృహ ప్రవేశాల సందర్భంగా అన్నదానానికి ముందుకు వస్తున్నారు. నిత్యం 120 నుంచి 150 మందికి అన్నం వడ్డిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం స్థానిక మహాలక్ష్మి ఐరన్, హార్డ్వేర్ యజమాని రామడుగు రవీందర్రావు రూ.5 లక్షలతో షెడ్డు నిర్మించారు.
రెండేళ్లుగా నిత్యాన్నదానం
విశ్వేశ్వరస్వామి దేవాలయంలో పదేళ్ల క్రితం ప్రతీ సోమవారం యాచకులకు అన్నదానం జరిగేది. అన్నపూర్ణ సేవా సమితి ఏర్పాటు చేశాక రెండేళ్ల క్రితం నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టాం. దాతలు సహాయం అందిస్తున్నారు.
– తాళ్లపెల్లి శ్రీనివాస్,
అన్నపూర్ణ సేవా సమితి సభ్యుడు, జమ్మికుంట
Comments
Please login to add a commentAdd a comment