ఓసీపీ–3ని సందర్శించిన ఈఅండ్ఎం డైరెక్టర్
గోదావరిఖని: ఓసీపీ–3 ప్రాజెక్టును ఈఅండ్ఎం డైరెక్టర్ సత్యనారాయణరావు బుధవారం సందర్శించారు. క్వారీ ప్రాంతాన్ని పరిశీలించి పలు విషయాలు తెలుసుకున్నారు. భారీ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. బొగ్గు అవసరాల దృష్ట్యా రవాణాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలని, లక్ష్యాలను సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. డైరెక్టర్ వెంట ఆర్జీ–2 ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య, ప్రాజెక్ట్ అధికారి మధుసూదన్, ఎస్‌ఓటూ జీఎం రాముడు, వకీల్‌పల్లి ప్రాజెక్ట్ అధికారి నెహ్రూ, ఏరియా ఇంజినీర్ నరసింహారావు, ప్రాజెక్ట్ ఇంజినీర్ రాజాజీ, ఏరియా వర్క్ షాప్ డీజీఎం ఎర్రన్న, మేనేజర్ ఓసీపీ–3 బారత్ కుమార్, సర్వే అధికారి నర్సింగరావు, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహమ్మద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment