చెరువులో పడి వృద్ధురాలి మృతి
హుజూరాబాద్: పట్టణ పరిధిలోని బోర్నపల్లి చెరువులోపడి వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నక్క సరోజన (58) ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుమారుడు కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించగా బోర్నపల్లి చెరువులో బుధవారం శవమై తేలింది. మృతురాలి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తిరుమల్‌గౌడ్ తెలిపారు.
చికిత్స పొందుతూ యువరైతు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): యువరైతు రోడ్డు ప్రమాదంలో గాయపడి 14రోజుల పాటు మృత్యువుతో పోరాడి బుధవారం మృతిచెందాడు. వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన ఇర్రి రాజశేఖర్‌రెడ్డి(38) ద్విచక్ర వాహనంపై ఈ నెల 5న రాత్రి రాగట్లపల్లి నుంచి పదిరకు వెళ్తుండగా, రోడ్డు పక్కన చెట్టును ఢీకొని సమీప పొలంలో పడిపోయాడు. ఆ రాత్రంతా పొలంలోనే ఉండిపోయాడు. అతడి ఆచూకీ కోసం ఆ రోజు కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలు కావడంతో సృహ కోల్పోయిన అతడిని మొదట ఎల్లారెడ్డిపేటకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజశేఖర్‌రెడ్డి తనకున్న మూడెకాల భూమిని సాగు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మృతుడికి భార్య శ్రీజ, కుమారుడు విహాన్‌రెడ్డి, కూతురు నిహరిక ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
కమాన్‌పూర్(మంథని): లక్నోలో జరుగనున్న జాతీయస్థాయి పరుగుపందెం పోటీలకు కమాన్‌పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెళ్లి ఆనంది ఎంపికై ంది. హన్మకొండలో బుధవారం నిర్వహించిన 68వ రాష్ట్రస్థాయి అండర్ 16 విభాగంలో 400 మీటర్ల పరుగుపందెంలో ప్రతిభకనబర్చి బంగారు పతకం సాధించింది. కాగా ఆనంది ఆదిలాబాద్ జిల్లా స్పోర్ట్స్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
Comments
Please login to add a commentAdd a comment