మహిళా కార్మికులకు ప్రత్యేక విధులు
● ఏరియాల్లోని వివిధ విభాగాలకు బదిలీ
● పోస్టింగ్‌ల నియామకానికి కౌన్సెలింగ్
గోదావరిఖని: సింగరేణిలోని మహిళా కార్మికులకు ప్రత్యేక విధులు కేటాయించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. మహిళా కార్మికుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో వివిధ విభాగాల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. సంస్థలో సుమారు 3వేల మందికి పైగా మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వారి సేవలను పలు విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కసరత్తు పూర్తి చేసింది. సీఎండీ బలరాం ఆదేశాల మేరకు ఏరియాల వారీగా వారికి పోస్టులను కేటాయించాలని చూస్తోంది. సంస్థ వ్యాప్తంగా మహిళా కార్మికులు ఉపరిత విభాగాల్లో పనిచేస్తున్నారు. డిపార్ట్‌మెంట్లు, జీఎం కార్యాలయాలు, వర్క్‌షాప్, స్టోర్స్, సివిల్ తదితర విభాగాల్లో పర్మినెంట్ మహిళా కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.
సింగరేణి ప్రత్యేక దృష్టి..
మహిళా కార్మికులను యాజమాన్యం పెద్దఎత్తున రి క్రూట్ చేసుకుంటోంది. కారుణ్య నియామకాల్లో భా గంగా తండ్రుల స్థానంలో వారి కూతుళ్లు విధుల్లో చేరుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు స్యూటేబుల్ పోస్టింగ్‌కు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో యాజమాన్యం పలు విభాగాల్లో సేవ లు వినియోగించుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
ఏరియాల్లో
కౌన్సెలింగ్
మహిళా కార్మికులను వివిధ విభాగాల్లోకి బదిలీ చేసేందుకు యాజమాన్యం కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. తమ ఉద్యోగాలను పలు విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని వారికి సూచిస్తోంది. సర్ఫేజ్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్లలో వీరికి విధులు కేటాయించనుంది.
సింగరేణి మహిళా కార్మికుల హోదాలు విభాగం హోదా
ఓసీపీలు, సీహెచ్‌పీ కన్వేయర్ ఆపరేటర్లు
సివిల్ పంప్‌ఆపరేటర్లు, వాల్వ్‌ఆపరేటర్లు
అండర్ గ్రౌండ్, ఓసీపీ చార్జర్ సేఫ్టీ ల్యాంప్, ల్యాంప్‌రూం ఫిట్టర్
గనులు, ఆస్పత్రులు, గెస్ట్‌హౌస్‌లు కుక్
క్యాంటీన్లు వెండర్లు, క్యాంటీన్ ఉమెన్(కుక్‌హెల్పర్)
గనులు, డిపార్ట్‌మెంట్లు ఆఫీస్ అటెండెంట్, స్వీపర్లు
ఓసీపీ, సర్వేఆఫీస్ సర్వే మజ్దూర్
ఏరియా, ఓసీ స్టోర్స్ స్టోర్స్ ఇష్యూ మజ్దూర్లు
ప్రింటింగ్ ప్రెస్ బైండర్, మిషిన్ ఉమెన్
ల్యాబ్, సీహెచ్‌పీ షాంప్లింగ్ మజ్దూర్లు
బేస్‌వర్క్‌షాప్, ఓసీపీ ఈపీ గ్రీజర్/హెల్పర్లు
ఓసీపీలు ఎక్స్‌ప్లోజివ్ క్యారియర్
Comments
Please login to add a commentAdd a comment