సీఎం సభకు వెళ్లిన ఆటో బోల్తా
కోనరావుపేట(వేములవాడ): వేములవాడలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సభకు ఆటోలో వెళ్లిన మహిళలు ప్రమాదానికి గురయ్యారు. కోనరావుపేట మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామం నుంచి 11 మంది మహిళలు ఆటోలో సీఎం సభకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో వేములవాడలోని బైపాస్‌రోడ్డులో వేరే వాహనం ఢీకొట్టడంతో ఆటో రెండు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 11 మంది మహిళలు గాయపడ్డారు. గాయపడిన వారిలో పిల్లి మమత, తాళ్లపెల్లి భూదవ్వ, అంగన్‌వాడీ టీచర్ హసీనా, సీఏ కవిత, వేములవాడ లాస్య, లత, చెప్యాల లాస్య, కనకలక్ష్మి, చక్రాల పావని, గుంటి లక్ష్మి, తాడూరి లత ఉన్నారు. వీరంతా వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు.
మహిళకు గాయం
ఇల్లంతకుంట: మండలంలోని వెల్జిపురం గ్రామానికి చెందిన బొర్ర పోషవ్వ వేములవాడలో సీఎం సభకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో గాయపడింది. ఆటోలో కాలు బయటపెట్టి కూర్చున్న క్రమంలో పక్క నుంచి మరో ఆటో కాలును తాకుతూ వెళ్లడంతో మడమకు తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
11 మంది మహిళలకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment