‘సిమ్స్’ను సందర్శించిన డీఎంఈ వాణి
కోల్‌సిటీ: గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (సిమ్స్) కళాశాలను బుధవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ వాణి సందర్శించారు. గురువారం మంచిర్యాల జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి ముందస్తుగా చేరుకునేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో గోదావరిఖనిలో ఆగారు. సిమ్స్ మెడికల్ కళాశాలను సందర్శించి టీచింగ్ హాల్, మెడికోల హాస్టల్, స్టాఫ్ క్వార్టర్స్, కళాశాల ఆవరణతో పాటు పరిశుభ్రత, సీసీ కెమెరాలు తదితరాలను పరిశీలించి కళాశాల నిర్వాహకులను అభినందించారు. కాలేజీని సందర్శించడానికి ముందు కలెక్టర్ కోయ శ్రీహర్షను కలిశారు. రాత్రి ఎన్టీపీసీలోనే డీఎంఈ బస చేస్తారని సమాచారం. గురువారం ఉదయం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శిస్తారని తెలిసింది. డీఎంఈతో సిమ్స్ ప్రిన్సిపాల్ హిమబిందు, సిద్దిపేట మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విమల, హెచ్వోడీలు అరుణ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి డీఎంఈ సిమ్స్ వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్‌తో పాటు హెచ్వోడీలు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment