‘యశోద’లో నిమోనియాకు అరుదైన చికిత్స
కరీంనగర్‌టౌన్: సోమాజిగూడ యశోద హాస్పిటల్లో ఇటీవల నియోనియాకు అరుదైన చికిత్స అందించి, ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడామని ఆస్పత్రి పల్మనాలజిస్టు విశ్వేశ్వరన్ బాలసుబ్రమణ్యం తెలిపారు. బుధవారం కరీంనగర్‌లోని యశోద మెడికల్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్ల వయసున్న సంగు శ్రీనివాస్‌ను తీవ్ర న్యుమోనియా కారణంగా యశోద హాస్పిటల్‌కు రిఫర్ చేశారన్నారు. అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఐసీయూకి తరలించామని తెలిపారు. న్యుమోనియా ఊపిరితిత్తుల్లో వస్తుందని, శ్రీనివాస్‌కు మాత్రం ఊపిరితిత్తులతోపాటు కాలేయంలో వచ్చిందని పేర్కొన్నారు. సెప్సిన్, సెప్టిక్ షాక్ కారణంగా వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స ప్రారంభించినట్లు వెల్లడించారు. 40 రోజులపాటు యాంటీబయాటిక్స్, శస్త్రచికిత్స, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన శ్రీనివాస్ పూర్తిగా కోలుకున్నాడని అన్నారు. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్ ద్వారా న్యుమోనియాను నియంత్రించవచ్చని చెప్పారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. మెరుగైన వైద్యం వల్లే తాను పూర్తిగా కోలుకున్నానంటూ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. సమావేశంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
పల్మనాలజిస్టు విశ్వేశ్వరన్
Comments
Please login to add a commentAdd a comment