No Headline
చలి.. పంజా విసురుతోంది
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరిగిపోతోంది. బుధవారం పెద్దపల్లి జిల్లాలో గరిష్టంగా 29.2 కాగా, కనిష్టంగా 15.2 డిగ్రీలకు తగ్గింది. ఉదయం, రాత్రి వేళల్లో చలి పంజా విసురుతుండడంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. చలి నుంచి రక్షణ కోసం స్వెట్టర్లు, రగ్గులు కొనుగోలు చేస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఉదయం వేళ మంచుకురుస్తూ జివ్వు మంటున్న చలితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా మాతాశిశు కేంద్రంలో పుట్టిన పసిపాపలతో భానుడి కిరణాల కోసం ఎదురుచూస్తూ ఇలా ‘సాక్షి’ కెమెరాకు కనిపించారు. డాక్టర్లు సైతం చిన్నా పెద్ద తేడా లేకుండా చలి దాటికి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. – జ్యోతినగర్/సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
Comments
Please login to add a commentAdd a comment