బైక్ అదుపుతప్పి, కెనాల్‌లో పడి
ఎలిగేడు(పెద్దపల్లి): బైక్ అదుపుతప్పి, కెనాల్‌లో పడిన ఘట నలో ఓ వ్యక్తి మృతిచెందాడు. జూలపల్లి ఇన్‌చార్జి ఎస్సై నరేశ్‌కుమార్ వివరాల ప్రకారం.. గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీకి చెందిన సిరిసిల్ల కిరణ్(37) కరీంనగర్‌లోని ఓ ఫైనాన్స్ కంపనీలో పని చేస్తున్నాడు. గత ఆదివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని, పని ముగిశాక జూలపల్లి మండలం చీమలపేటలో స్నే హితుడిని కలిసివస్తానని ఇంట్లో చెప్పి, బైక్‌పై అతని మిత్రుడితో వెళ్లాడు. రాత్రి 9 గంటలకు చీమలపేట నుంచి గోదావరిఖని తిరిగి వస్తుండగా రాములపల్లి–నారాయణపూర్ గ్రామాల మధ్య బైక్ అదుపుతప్పి, ఎస్సారెస్పీ కెనాల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో కిరణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వెనక కూర్చున్న స్నేహితుడి చేయి విరిగింది. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు.
వ్యక్తి మృతి
మృతుడు గోదావరిఖనివాసి
Comments
Please login to add a commentAdd a comment