కార్యదర్శుల గోడు వినండి
● అదనపు కలెక్టర్లకు టీఎన్జీవో నేతల వినతి
కరీంనగర్ అర్బన్: పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై ఉన్నతాధికారులు సానుకూలంగా వ్యవహరించాలని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. మంగళవారం సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌దేశాయ్, లక్ష్మికిరణ్‌ను కలిసి కార్యదర్శుల సమస్యలను విన్నవించారు. గత కొన్ని నెలలుగా సర్వేలు, ఇతరశాఖలకు సంబంధించిన విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. విధులు, సర్వేలు కేటాయించేటప్పుడు వాట్సప్ మెసేజ్‌లు, జూమ్ మీటింగ్‌ల ద్వారా కాకుండా సర్క్యులర్ ద్వారా మాత్రమే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సెలవు దినాలలో మినహాయింపు ఇవ్వాలని, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సివస్తే వాటి సెలవులను తదుపరి రోజుల్లో వాడుకునే వెసులుబాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.జేపీఎస్‌ల నాలుగేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్‌కాలంగా పరిగణించాలని కోరారు. టీపీఎస్సీఫ్ జిల్లా అధ్యక్షుడు గోదారి అజయ్, జిల్లా కార్యదర్శి రమేశ్, అసోసియేట్ కార్యదర్శి సుస్మిత, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రాకేశ్, కిరణ్‌కుమార్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment