ఉత్తమ్ కుమార్‌రెడ్డివి ఉత్తమాటలేనా?
● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్
కరీంనగర్: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఏడాది అవుతున్నా అమలు చేయలేదని మాజీ సివిల్ సప్లయ్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ విమర్శించారు. మంగళవారం మాట్లాడుతూ 40 ప్రభుత్వశాఖల్లో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి సమానపనికి సమానం వేతనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్వశిక్ష ఉద్యోగుల సమస్యలను సచివాలయానికి పిలిచి టీ తాగే లోపు జీవో విడుదల చేసి పరిష్కరిస్తానని తెలిపారని, ఏడాది గడుస్తున్న వారి సమస్యలు పరిష్కరించలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అమలులో విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికై నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment