భూ సర్వేకు కసరత్తు | - | Sakshi
Sakshi News home page

భూ సర్వేకు కసరత్తు

Published Wed, Dec 11 2024 1:46 AM | Last Updated on Wed, Dec 11 2024 1:46 AM

-

● ప్రతీ వ్యవసాయ క్షేత్రానికి నక్ష ● భూవివాదాల పరిష్కారానికి చర్యలు

కరీంనగర్‌ అర్బన్‌: వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి భూ వ్యవసాయ క్షేత్రానికి తప్పనిసరిగా నక్ష ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ధరణిలో అవకతవకలు జరిగాయని ఆర్వోఆర్‌–2024ను అమలులోకి తేవాలని యోచిస్తోంది. తాజాగా క్రయవిక్రయాలు జరిగే సమయంలో భూనక్ష చిత్రం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. మ్యుటేషన్‌లోనూ విచారణ ప్రక్రియ తదుపరి రికార్డులకు చేరనుంది. ఈ క్రమంలో సర్వేయర్ల ఆవశ్యకత పెరిగింది. సదరు సర్వేయర్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో గ్రామాల్లో భూ వివాదాలు పేరుకుపోయాయి. వీటి పరిష్కారానికి ధరణి వెబ్‌సైట్‌లో చోటులేక వివాదా స్పదమవుతోంది. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే– భూ దస్త్రాల విభాగాల పటిష్టతపై కసరత్తు ప్రారంభించింది.

ప్రభుత్వ పనుల్లో సర్వేయర్ల బిజీ

జిల్లావ్యాప్తంగా సర్వేయర్ల కొరతతో భూముల కొలతలు రైతుల్ని వేధిస్తున్నాయి. వేల సంఖ్యలో కొలతల కోసం రైతులు అందజేసిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వేయర్లు ఖాళీలున్న చోట పక్క మండలాల వారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. దీనికి తోడు ప్రభుత్వ పనులు అధికంగా ఉండటంతో దరఖాస్తులు పెండింగ్‌లో పెడుతున్నట్లు తెస్తోంది. ముఖ్యంగా రహదారుల నిర్మాణం, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, తదితర అభివద్ధి పనుల భూ సేకరణకు సర్వే చేపట్టాల్సి వస్తోందని, తొలుత ప్రభుత్వ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కర్షకుల భూముల సర్వేలో జాప్యం ఏర్పడుతోందని సర్వేయర్లు చెబుతున్నారు.

శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు

జిల్లాలో నిజాం పాలనలో సేత్వార్‌ పేరిట 1938–45 మధ్య కాలంలో సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. రెవెన్యూ గ్రామాల్లో పట్టాదారుల సమాచారంతో కాస్రా– పహాణి తయారు చేసి అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణించింది. సమస్య ఏర్పడినప్పుడు విక్రయాలు జరిగి వివాదాలు తలెత్తిన సమయంలో భూ కొలతల శాఖ వద్ద ఉన్న టీపన్‌ (కొలతల పుస్తకం) రూపంలో కొనుగోలుదారుకు భూమిని అప్పజెబుతూ వస్తున్నారు. రెవెన్యూశాఖ వద్ద ఉన్న కాస్రా పహాణి ఆధారంగానే భూ దస్త్రాల ప్రక్షాళన కొనసాగించారు. తరచూ భూముల వివాదాలు అపరిష్కతంగా కొనసాగుతున్నాయి. వాటి శాశ్వత పరిష్కారం దిశగా భూసర్వే అంశం, నక్ష ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం సర్వేయర్లు: 32, సర్వేయర్ల కొరత: 16

ఉండాల్సిన డిప్యూటీ సర్వేయర్లు: 16

ఉన్నది: 5, ఉండాల్సిన సర్వేయర్లు: 16

ఉన్నది: 11 మంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement