కరీంనగర్ కార్పొరేషన్: పనులు సగంలోనే నిలిచి పోయిన కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వెళ్లే రోడ్డును మంగళవారం నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ పరిశీలించారు. గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ పథకం నిధులతో చేపట్టిన ఈ రోడ్డు పనులను అర్ధాంతరంగా నిలిపివేయడం తెలిసిందే. దీనితో సంవత్సరకాలంగా ఈ ప్రాంతవాసులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో కమిషనర్ సందర్శించారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం గిద్దెపెరుమాండ్ల స్వామి ఆలయం సమీపంలోని మైదానాన్ని, వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు. కమిషనర్ వెంట డీఈ ఓం ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment