మేనేజ్‌మెంట్ విద్యాసంస్థతో ఒప్పందం
కరీంనగర్‌సిటీ: కళాశాల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు, కళాశాల అధ్యాపకులకు రీసెర్చ్ వర్క్‌షాప్, శిక్షణ కల్పించాలనే ఉద్దేశంతో మేనేజ్‌మెంట్ విద్యాసంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె. రామకృష్ణ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని శామీర్‌పేటలోని ఐపీఈ క్యాంపస్ ఆవరణలో కళాశాల అధ్యాపకులు, ఎంట్ర ప్రెన్యూర్షిప్ సెల్ కన్వీనర్ బూర్ల నరేశ్, కె.అర్జున్, ఐపీఈ సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ మూర్తి, వై.రామకృష్ణ బృందం సమక్షంలో ఎస్సారార్ కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యాలు, ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు శ్రీకాంత్, లక్ష్మికుమారి, వై.రామకృష్ణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment