చందుర్తి(వేములవాడ): ఇంటిని అక్రమంగా గిఫ్ట్ డీడ్ చేసుకున్న కేసులో తండ్రీకూతురిని అరెస్టు చేశామని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చందుర్తి మండలంలోని నర్సింగపూర్‌కు చెందిన జాగిరి దేవలింగం అలియాస్ దేవయ్యకు నలుగురు కుమారులున్నారు. వీరిలో నర్సయ్య తన ముగ్గురు సోదరులకు రూ.80 వేలు చెల్లించి, ఉమ్మడి ఇంటిని తీసుకున్నాడు. అయితే, ఈ అన్మదమ్ముల్లో ఒకరైన పర్శరాములు ఇదే ఇంటిని తన కూతురు మానస పేరిట గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించాడు. అతని అల్లుడు నేరెల్ల రమేశ్ డాక్యుమెంట్ రైటర్ కావడంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నర్సయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పర్శరాములు, మానస, రమేశ్‌లపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. తండ్రీకూతురిని మంగళవారం అరెస్టు చేయగా, అల్లుడు రమేశ్ పరారైనట్లు తెలిపారు.
పరారీలో అల్లుడు
Comments
Please login to add a commentAdd a comment