ముగిసిన రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టె క్నో స్కూల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న 68వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 నెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఎంపిక పోటీలు మంగళవారం ముగిశా యి. బాలుర విభాగంలో కరీంనగర్ ప్రఽథమ స్థానంలో, మహబూబ్‌నగర్ ద్వితీయ, ఖమ్మం జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో ఖ మ్మం ప్రథమ, కరీంనగర్ ద్వితీయ, హైదరాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో జనార్దన్‌రావు హాజరై, మాట్లాడారు. క్రీడలతో శారీర క దృఢత్వం, మానసికోల్లాసం కలుగుతాయన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలి పారు.అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు అనేక క్రీడా పోటీలు నిర్వహిస్తూ జి ల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
గెలిపిస్తే గ్రంథాలయాల బలోపేతానికి
కృషి చేస్తా..
నిరుద్యోగ యువతకు బాసటగా నిలిచేందుకే పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో ఉంటున్నానని, గెలిపిస్తే గ్రంథాలయాల బలోపేతానికి కృషి చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో మంగళవారం వీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటిరియల్‌ను 600 మంది నిరుద్యోగ యువతకు ఉచితంగా అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను అనేక గ్రంథాలయాలకు వెళ్లానని, చాలాచోట్ల మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు. సొంత ఖర్చులతో నిరుద్యోగులకు భోజన ఏర్పాటు చేయడంతోపాటు చైర్ ప్యాడ్స్, వాటర్ కూలర్స్, సింటెక్ ట్యాంకులు, కొన్నిచోట్ల అదనపు తరగతి గదులకు రేకులు వేయించానని పేర్కొన్నారు. తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి, గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బుర్ర మధుసూదన్ రెడ్డి, చందు, సత్యం తదితరులు పాల్గొన్నారు.
బాలుర విభాగంలో కరీంనగర్..
బాలికల విభాగంలో
ఖమ్మం ప్రథమ స్థానం
Comments
Please login to add a commentAdd a comment