కోడెల అక్రమ విక్రయంపై ఆగ్రహజ్వాలలు
వేములవాడ: వేములవాడ రాజన్న కోడెలను అక్రమంగా తరలించి అమ్ముకున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిరసనలు వెల్లువెత్తాయి. కోడెల విక్రయంలో బాధ్యులైన ఆలయ అధికారులను సస్పెండ్ చేయాలని, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజీపీ ఆధ్వర్యంలో రాజన్న ఆలయ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. పార్టీ పట్టణాధ్యక్షుడు సంతోష్‌బాబు, గుడిసె మనోజ్, రేగుల రాజకుమార్, నామాల శేఖర్, కోరెపు నరేష్, ఖమ్మం పృథ్వీరాజ్, బండి నరేష్, కోరెపు వెంకటేష్, శ్రావణ్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
‘మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి’
రాజన్న కోడెలు తప్పుదోవ పట్టిన అంశంపై మంత్రి కొండ సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి కొండా సురేఖ సిఫారసు లేఖతోనే రాంబాబుతోపాటు మరో ఇద్దరు రాజన్న గోశాల నుంచి కోడెలను తీసుకెళ్లారన్నారు. కోడెల తరలింపులో బాధ్యులుగా పేర్కొంటూ ఈవో వినోద్‌రెడ్డిని సస్పెండ్ చేయాలని కోరారు. కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, గోలి మహేశ్, శంకర్ తదితరులు ఉన్నారు.
వేములవాడలో నిరసన తెలిపిన బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment