టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం
కరీంనగర్ అర్బన్: తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీని టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్ రెడ్డి, సంగెం లక్ష్మణ్‌రావు బుధవారం కరీంనగర్‌లో సన్మానించారు. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, ఒంటెల రవీందర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, నాగరాజు, టీజీవో నాయకులు కిరణ్, హస్గర్, శ్రీనివాస్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
వీధికుక్కల స్వైరవిహారం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కుక్కల భయానికి ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. బుధవారం రుద్రంగి మండల కేంద్రంలోని 13, 14 వార్డుల్లో చారి అనే యువకుడు, నర్సవ్వ అనే వృద్ధురాలుతోపాటు మరో ఇద్దరు మహిళలపై దాడిచేసి గాయపరిచాయి.
మాజీ కౌన్సిలర్‌కు ఏడాదిన్నర జైలు
సిరిసిల్లకల్చరల్: పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించిన ఘటనలో సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్‌కు ఏడాదిన్నర జైలు విధిస్తూ ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు వెల్లడించారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు. 2017 ఫిబ్రవరి 2న కార్గిల్‌లేక్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మద్యం సేవించి బైక్ నడుపుతూ గుగులోతు హన్మంత్‌నాయక్ అనే అప్పటి మున్సిపల్ కౌన్సిలర్ పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. తన కాలర్ పట్టుకుని, దుర్భాషలాడాడని కానిస్టేబుల్ బొంగోని నాగరాజు ఫిర్యాదు చేశాడు. ఎస్సై లియాఖత్ అలీ కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఏడాదిన్నర జైలుతోపాటు రూ.7వేలు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.
బైండోవర్ ఉల్లంఘన కేసులో మహిళలకు శిక్ష
గోదావరిఖని: రామగుండం మండలం పీకేరామయ్య కాలనీకి చెందిన ఇద్దరు మహిళలకు జైలు శిక్ష విధించినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. బైండోవర్ ఆంక్షలు ఉల్లంఘించి నాటుసారా విక్రయించినందుకు వారికి మూడునెలలు జైలు శిక్ష విధించినట్లు ఎకై ్సజ్ సీఐ మంగమ్మ బుధవారం తెలిపారు. గతంలో వీరిద్దరినీ రామగుండం తహసీల్దార్ ఎదుట హాజరుపరిచామన్నారు. అయినా, ఆ ఇద్దరు మహిళలు బైండోవర్ ఆంక్షలను ఉల్లంఘించి నాటుసారా విక్రయించడంతో కేసు నమోదు చేసి రామగుండం తహసీల్దార్ ఎదుట హాజరుపర్చామన్నారు. దీంతో వారికి రూ.లక్ష జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోవడంతో మూడునెలల జైలు శిక్ష విధించినట్లు ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment