ఆశ్రమానికి వృద్ధురాలి తరలింపు
జగిత్యాల: జగిత్యాల జిల్లాకేంద్రంలోని చిలుకవాడకు చెందిన వృద్ధురాలు అలకొండ రాజవ్వను తన కుమారుడు శ్రీనివాస్ మోతె శ్మశాన వాటికలో 15 రోజుల క్రితం వదిలివెళ్లిన విషయం తెల్సిందే. ఆర్డీవో మధుసూదన్ ఆధ్వర్యంలో ఆ వృద్ధురాలిని శ్మశానం నుంచి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆర్డీవో, సంక్షేమ శాఖ అధికారి నరేశ్ ఆధ్వర్యంలో ఆమె కుమారులు శ్రీనివాస్, గోపాల్‌కు అప్పగించారు. అయితే రెండు రోజుల క్రితం సదరు వృద్ధురాలిని ఆమె కుమారులు శ్మశాన వాటికలో వదిలివెళ్లారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వృద్ధాశ్రమానికి తరలించారు.
చర్యలు తీసుకుంటాం
– మధుసూదన్, ఆర్డీవో
నడవలేని స్థితిలో ఉన్న రాజవ్వను ఆమె కుమారులు శ్మశానంలో వదిలివెళ్లారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో మధుసూదన్ తెలిపారు. వృద్ధురాలి పోషణ, సంరక్షణ చూసుకోకుండా శ్మశానంలో విడిచిపెట్టినందుకు సీనియర్ సిటిజన్ల సంరక్షణ చట్టం 2007లోని సెక్షన్–24 ప్రకారం తిరుపతి, శ్రీనివాస్, గోపాల్, రవికి మూడు నెలల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెయింటెన్స్ ట్రిబ్యునల్ ముందు హాజరు పర్చాలని పోలీసులను కోరామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment