రాష్ట్ర ఒలింపిక్ సంఘంలో ఉమ్మడి జిల్లావాసులకు చోటు
కరీంనగర్‌స్పోర్ట్స్: తెలంగాణ ఒలింపిక్ సంఘంలో ఉమ్మ డి జిల్లావాసులకు అవకాశం దక్కింది. ఇటీవల హైదరా బాద్‌లో సంఘం ఎన్నికలు నిర్వహించారు. బుధవారం ఎ న్నికల అధికారి, రిటైర్డ్ హైకోర్టు జడ్జి ప్రవీణ్ కుమార్ ఫలి తాలను వెల్లడించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉమ్మ డి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడిగా పెద్దపల్లి జూడో సంఘం ప్రధాన కార్యదర్శి సిలివేరి మహేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర జూడో సంఘానికి కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న మహేందర్ తెలంగాణ ఒలింపిక్ సంఘానికి కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవం అయ్యాడు. వీరిని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, వివిధ జిల్లాల డీవైస్ వోలు, సంఘాల రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, పీఈటీలు, విద్యా సంస్థల అధినేతలు, క్రీడా సంఘాల చైర్మన్లు కడారి అనంతరెడ్డి, ఊట్కూరి నరేందర్‌రెడ్డి, ప్రసాద్‌రావు, దాసరి శ్రీపాల్‌రెడ్డి, రమణారావు, మహమ్మద్ కరీం, సీహెచ్.సంపత్‌రావు, గిన్నె లక్ష్మణ్, వై.మహేందర్‌రావు, ఎండీ.యూనిస్‌పాషా, ముత్యాల రవీందర్, అంతటి శంకర య్య, బిట్ర శ్రీనివాస్, గెల్లు మధుకర్ యాదవ్ పాల్గొన్నారు.
సంయుక్త కార్యదర్శిగా జనార్దన్‌రెడ్డి, సభ్యుడిగా మహేందర్ ఏకగ్రీవం
Comments
Please login to add a commentAdd a comment