రెండు బైక్‌లు ఢీ
● తీవ్రంగా గాయపడ్డ మహిళ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పొత్తూరు పెట్రోల్‌బంక్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది. మండలంలోని నారెడ్డిపల్లెకు చెందిన ఆకారం అజయ్, పూజిత దంపతులు కరీంనగర్‌కు బుధవారం ఉదయం వెళ్లి వస్తుండగా మండలంలోని పొత్తూర్ పెట్రోల్‌బంక్ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పూజిత తలకు తీవ్రంగా గాయాలు కావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇల్లంతకుంట ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ సందర్శించి వివరాలు సేకరించారు.
ఆలయంలో చోరీ
సారంగాపూర్: మండలంలోని అర్పపల్లి కొండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు హుండీని పగులగొట్టి నగదు, బంగారం దొంగిలించారు. పోలీసుల కథనం ప్రకారం మంగళవారం రాత్రి ఆలయ తాళాలు పగులగొట్టి, ఆలయంలోకి ప్రవేశించి హుండి పగులగొట్టారు. అందులో ఉన్న కొంత బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారని ఆలయ ఇన్‌చార్జి గణేశ్ ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యాలయంలో మత ప్రచారం చేసేందుకు యత్నించిన ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజును సస్పెండ్ చేస్తూ డీఈవో జగగ్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ మతానికి సంబంధించిన కరపత్రం, ఇతర సామగ్రి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ విషయం జిల్లా విద్యాధికారికి చేరడంతో ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినట్లు డీఈఓ తెలిపారు. పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదుతో ఇంగ్లిష్ టీచర్ రాజుపై ఎల్లారెడ్డిపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకే ప్లాట్ ఇద్దరికి విక్రయం
వేములవాడఅర్బన్: కరీంనగర్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన బొద్దుల రాంనారాయణ సిరిసిల్లలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సిరిగిరి రమేశ్ వద్ద 2004లో వేములవాడ నందికమన్ ప్రాంతంలోని 200 గజా ల స్థలాన్ని కొని రిజిస్టేషన్ చేసుకున్నాడు. నెలక్రితం అతను తన ప్లాట్ వద్దకు వెళ్లిచూడగా సిరిగిరి రమేశ్ ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించి ఇతరులకు వి క్రయించాడని తెలిసింది. బాధితుడు రాంనా రాయణ రమేశ్‌ను ప్రశ్నించగా తనపై ఎస్సీ,ఎస్టీ అట్రా సిటి కేసు పెడతామని బెదిరించాడు. ప్లాట్ తిరిగి కావాలంటే తనకు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రాంనారాయణ రూ.లక్ష ఇచ్చాడు. మరో రూ.50వేలు డిమాండ్ చేయడంతోపాటు చంపుతానని బెదిరించినట్లు చెప్పాడు. ఈమేరకు రాంనారయణ ఫిర్యాదుతో వేములవాడ ఠాణాలో కేసు నమోదు చేసి రమేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment