మిత్రుడికి ఆపద పేరిట చాటింగ్
పాలకుర్తి(రామగుండం): మిత్రుడి పేరిట ఫోన్‌చేసిన సైబర్‌నేరగాళ్లు రూ.లక్ష కాజేసేందుకు యత్నించారు. ఈఘటన జీడీనగర్‌లో మంగళవారంరాత్రి చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. జీడీనగర్‌కు చెందిన అజీజ్ మిత్రుడు తాజ్ సౌదీలో ఉంటున్నాడు. అతడి మొబైల్‌ను హ్యాక్ చేసిన సైబర్‌నేరగాళ్లు.. అతడి ప్రొఫైల్ ఫొటో కలిగిన వేరొక మొబైల్ నంబర్‌తో అజీజ్‌కు మేసేజ్ పంపించారు. తొలుత అతడి క్షేమసమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వా తన వద్ద రూ.5,55,289 ఉన్నాయని, మీ బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు పంపించాలని సైబర్‌నేరగాళ్లు అజీజ్‌కు మేసేజ్ చేశారు. ఆ వెంటనే అజీజ్ బ్యాంకు ఖాతా వివరాలను పంపించారు. గంట తర్వాత వచ్చిన మరో ఫోన్‌కాల్‌తో.. తాము సెంట్రల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, సౌదీలోని మీ మిత్రుడి వివరాల గురించి తెలిసిందని, మీ అకౌంట్‌కు రూ.5,55,289 సొమ్ము తమ బ్యాంక్ నుంచి బదిలీ చేశాడని తెలిపారు. 24గంటల్లోగా మీ అకౌంట్‌లో ఆ డబ్బులు జమ అవుతాయని, ఇందుకు బ్యాంక్ రశీదు చూసుకోవాలంటూ అజీజ్ ఫోన్‌కు స్లిప్పు పంపించారు. పది నిమిషాల తర్వాత మరో కాల్‌చేసి.. తాను సౌదీలో సమస్యలో చిక్కుకున్నానని, రెండునెలల క్రితమే తన వీసా గడువు ముగిసిందని, నీకు ఒక ఫోనంబరు పంపిస్తా, పూర్తివివరాలు అతడు చెబుతాడని చెప్పి ఫోన్ కట్‌చేశారు. ఆ తర్వాత మెసేంజర్ ద్వారా ఒక నంబర్‌ను అజీజ్ ఫోన్‌కు మెసేజ్ చేశారు. అజీజ్ వెంటనే ఆ నంబర్‌కు కాల్‌చేయగా లిఫ్ట్ చేసిన వ్యక్తి.. మీ మిత్రుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడని, అర్ధగంట లోగా రూ.లక్ష పంపిసేఏత వీసా రెన్యూవల్ అవుతుందని, లేదంటే రూ.10లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల శిక్ష ఉంటుందని భయపెట్టేశారు. తనమిత్రుడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తెలిసినవారి వద్ద రూ.లక్ష అప్పు చేసి సదరు మిత్రుడికి పంపించేందుకు సిద్ధమయ్యాడు. ఈలోగా ఈ విషయాన్ని అతడికి చెప్పేందుకు ఫోన్‌చేయగా ఎంతకీ ఎత్తలేదు. అనుమానంతో మరోనంబరుతో ఎత్తగా.. తన మొబైల్ హ్యాక్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన అజీజ్.. కంగుతిన్నాడు. ఆ తర్వాత తనకు వచ్చిన ఫోన్‌కాల్స్, మెసేజ్‌లపై ఆరా తీయగా.. బిహార్ రాష్ట్రంలోని పాట్నా కంకల్‌బాల్ ఏరియాకు చెందినదిగా తేలింది.
వ్యక్తి నుంచి రూ.లక్ష కాజేందుకు యత్నం
అప్రమత్తతో తప్పిన సైబర్ నేరగాళ్ల ముప్పు
Comments
Please login to add a commentAdd a comment