గుండెపోటుతో రైతు మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్లబొప్పాపూర్‌కు చెందిన రైతు చిందు శంకర్(50) గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శంకర్ తనకున్న ఎకరన్నర భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే సోమవారం సాగు పనులకు వెళ్లాడు. రాత్రి వచ్చి, భోజనం చేసి, పడుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత గుండెలో నొప్పిగా ఉందని కుటుంబసభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు మెండె శ్రీనివాస్, మాజీ సర్పంచు బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండ రమేశ్ కోరారు.
జీవాలపై హైనా దాడి
చిగురుమామిడి: మండలంలో హైనా దాడులతో రైతులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల్లో రెండు పశువులపై దాడి చేసి, చంపింది. సోమవారం అర్ధరాత్రి సుందరగిరికి చెందిన గైని చంద్రమౌళి గేదె, ఆదివారం అర్ధరాత్రి గాగిరెడ్డిపల్లికి చెందిన చెన్నవేని మల్ల య్య లేగదూడను చంపేసింది. హైనా బారి నుంచి తమను రక్షించాలని రైతులు కోరుతున్నారు.
యువకుడిపై పోక్సో కేసు
కోరుట్ల: బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన ఓ బాలికపై స్థానికుడైన ఇప్ప రవి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాధితురాలు తల్లిదండ్రులు విషయం చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈ మేరకు రవిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బాలికను వేధిస్తున్న
యువకుడి రిమాండ్
ముస్తాబాద్(సిరిసిల్ల): బాలికను వేధిస్తున్న ఓ యువకుడిని పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై గణేశ్ తెలి పిన వివరాల ప్రకారం... ముస్తాబాద్ మండలం కొండాపూర్‌కు చెందిన గుండెల్లి అజ య్‌కుమార్ అదే గ్రామానికి చెందిన బాలి కను కొన్ని నెలలుగా ప్రేమిస్తున్నానని వేధి స్తున్నాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, విచారణ జరిపి, అజయ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment