జగిత్యాల జోన్: భూ తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఇద్దరు వ్యక్తులకు యావజ్జీవ శిక్షతోపాటు రూ.10 వేల చొప్పున జరిమానా, మరొకరికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ తీర్పు చెప్పా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలంలోని యామాపూర్‌కు చెందిన చెదలు రాజేందర్–లత దంపతులకు ము గ్గురు పిల్లలున్నారు. వీరిది వ్యవసాయ కుటుంబం. గ్రామ శివారులోని కొండాపూర్ ఒర్రె వద్ద భూమి ఉంది. ఈ ఒర్రెకు అవతలి వైపు కాస సంజీవ్ భూమి ఉంది. అందులోకి వెళ్లే దారి విషయంలో సంజీవ్, రాజేందర్‌ల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతోపాటు పూర్వీకులకు సంబంధించిన మూడెకరాల భూమి పైనా వివాదా లున్నాయి. ఈ నేపథ్యంలో రాజేందర్ జనవరి 3, 2022న భార్య లత, కూలీలతో కలిసి తన తోటలో వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ఒర్రె పక్కనున్న వ్యవసాయ బావికి కరెంట్ మోటార్ బిగించేందుకు వెళ్లాడు. కాసేపటికే అరుపులు వినిపించడంతో లత, కూలీలు అక్కడికి పరుగెత్తారు. వారిని చూసి, సంజీవ్, మరికొందరు కత్తులతో పారిపోయారు. రాజేందర్ రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎ స్సై ఉమాసాగర్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించి, కాస సంజీవ్‌తో పాటు తైడపల్లి రజనీకాంత్, మంగళారపు లక్ష్మీనారా యణలను అరెస్టు చేశారు. కోర్టులో చార్జిషీట్ వేశా రు. కోర్టు మానిటరింగ్ అధికారులు రంజిత్, కిరణ్‌కుమార్ న్యాయస్థానంలో సాక్షులను ప్రవేశపెట్టా రు. జడ్జి సాక్ష్యాధారాలు పరిశీలించి, సంజీవ్, రజనీ కాంత్‌లకు యావజ్జీవం, లక్ష్మీనారాయణకు ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చారు.
మరొకరికి ఐదేళ్ల జైలు
Comments
Please login to add a commentAdd a comment