చిగురుమామిడి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లికి చెందిన దరిపెల్లి రవి(31) మంగళవారం సుందరగిరి వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అదే సమయంలో టాటాఏస్ వాహనం సుందరగిరి వైపు నుంచి వస్తోంది. బొమ్మనపల్లి ఊరిలోనే బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి కుడికాలు పూర్తిగా విరిగిపోగా, తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. మద్యంతాగి బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి పోలీసులను చూసి వెనుకకు అతి వేగంగా వెళ్తూ మరో బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. చరణ్‌ను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
న్యాయవాదికి...
సిరిసిల్ల క్రైమ్ : పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది ధర్మేందర్ కారులో కరీంనగర్ వెళ్తుండగా చింతకుంట వద్ద వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నుజునుజ్జుకాగా ధర్మేందర్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment