కరీంనగర్: గతేడాది సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కరీంనగర్ జిల్లాశాఖ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మెకు దిగారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి, క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. వీరికి వివిధ పార్టీల నాయకులు గీట్ల ముకుందరెడ్డి,ఎడ్ల రమేశ్,మిల్కూరి వాసుదేవరెడ్డి, కన్నం లక్ష్మణ్, బాలయ్య, సుగుణాకర్రావు, రవీందర్ సింగ్ సంఘీభావం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment