చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
విద్యానగర్(కరీంనగర్): చట్టాలపై ప్రతీఒక్కరు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ సూచించారు. మానవ హక్కు ల దినోత్సవం సందర్భంగా మంగళవారం కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. వెంకటేశ్ మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీపౌరుడికి రాజ్యాంగం అనేక హక్కులు కల్పించిందన్నారు. వాటిని కాపాడుకోవడానికి చట్టాలు చేయడం జరిగిందన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
కరీంనగర్: తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మాజీ సర్పంచ్‌ల జేఏసీ జిల్లా అధ్యక్షుడు జోగు లక్ష్మిరాజం(సాగర్)ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్ష మంగళవారం రెండవ రోజుకి చేరింది. శిబిరాన్ని మాజీ సర్పంచ్‌ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సందర్శించారు. బిల్లులు ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి దుబారా ఖర్చులు చేస్తున్నాడన్నారు. మంత్రి సీతక్క ఇచ్చిన హామీపై ఒక్కమాట మాట్లాడడం లేదన్నారు. పెండింగ్ బిల్లులు విడుదల చేసేవరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా సలహాదారు బొజ్జం మల్లేశం, మల్యాల దేవయ్య, కార్యదర్శులు లక్ష్మణ్, మహేందర్, ఎండీ.నజీర్, మడ్లపెల్లి గంగాధర్, రామిడి సురేందర్, వడ్లూరి ఆదిమల్లు, వేముల దామోదర్, మొగిలి సమ్మయ్య, లచ్చయ్య, రాజేశం, ప్రశాంత్, మాల చంద్రయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
జమ్మికుంట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ సూచించారు. మండలంలోని వావిలాల పీహెచ్‌సీ, జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫా ర్మసీ, లేబర్, ల్యాబ్‌రూంలను పరిశీలించారు. ఎన్సీడీ క్లినిక్స్ నిర్వహించాలని, హైపర్ టెన్షన్, డయాబెటిస్, బ్రెస్ట్ కేన్సర్, లెప్రసీ సర్వే నిర్వహించాలని సూచించారు. సాధారణ ప్రసవాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, అవసమైతేనే సిజేరియన్ చేయాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, జమ్మికుంట ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్‌రెడ్డి, రాజేశ్, పంజాల ప్రతాప్‌గౌడ్, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment